పవన్ కల్యాణ్: ఆ విషయం తప్పని పవన్ కల్యాణ్ కు తెలియదా?: ఆర్.కృష్ణయ్య

  • ‘మంజునాథ’ నివేదిక ఇవ్వకముందే అసెంబ్లీలో బిల్లు  ఎలా ప్రవేశపెడతారు?
  • ఈ విషయం పవన్ కు తెలియదా?
  • కాపు రిజర్వేషన్లకు బీసీలు వ్యతిరేకం: టీటీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు, వారసత్వ రాజకీయాలపై విమర్శలు గుప్పించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై టీ-టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మంజునాథ కమిషన్ తన నివేదిక ఇవ్వకముందే, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం తప్పన్న విషయం పవన్ కు తెలియదా? అని ప్రశ్నించారు. టీడీపీ మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలపై పవన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించిన ఆయన, కాపు రిజర్వేషన్లకు బీసీలు వ్యతిరేకమని అన్నారు. ఈ నెల 24న మైలవరంలో బీసీ సింహగర్జన నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా కృష్ణయ్య తెలిపారు.

  • Loading...

More Telugu News