పవన్ కల్యాణ్: మీరు ప్రశ్నించే స్థితిలో ఉన్నారా? సమాధానం ఇచ్చుకోవాల్సిన స్థితిలో ఉన్నారా?: పవన్ కల్యాణ్ కు వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ సూటి ప్రశ్నలు

  • పవన్.. రెండు షూటింగ్ ల మధ్య విరామమే రాజకీయమా?  
  • మీ అన్న సీఎం కాలేదన్న కడుపు మంటే మీ పార్టీ సిద్ధాంతమా?
  • చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేసిన అరాచకంలో మీకు వాటా ఉందా? లేదా?:  ప్రశ్నలు గుప్పించిన వాసిరెడ్డి పద్మ

వైజాగ్ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ స్పందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి’ అంటూ ప్రశ్నలు సంధించారు.

 - పవన్ కల్యాణ్ .. మీరు ప్రశ్నించే స్థితిలో ఉన్నారా? సమాధానం ఇచ్చుకోవాల్సిన స్థితిలో ఉన్నారా? అసలు, మీకు ప్రశ్నించే హక్కుందా? రెండు షూటింగ్ ల మధ్య విరామమే రాజకీయమా?  

- చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క అరాచకానికీ, అన్యాయానికి, రాజ్యాంగ ఉల్లంఘనకు..ఈ నేరాలన్నింటిలో మీకు వాటా ఉందా? లేదా?

- చివరికి చంద్రబాబునాయుడు దోపిడీలో కూడా మీకు వాటా ఉండబట్టే ఆయన స్క్రిప్ట్ కు అనుకూలంగా డైలాగ్స్ మాట్లాడుతున్నారా?

- కొత్తగా పెట్టుకున్న పార్టీలు అధికారపక్షం వైఫల్యాల గురించి మాట్లాడటం చూశాం గానీ, అధికార పార్టీ స్క్రిప్ట్ కు అనుకూలంగా ప్రభుత్వం మీద రెండు విమర్శలు, ప్రతిపక్షం మీద నాలుగు విమర్శలు చేసే అతి తెలివి రాజకీయాన్ని మొట్టమొదటగా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు.

- ఈ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టడంలో మీరు బాధ్యులు..కాబట్టి ఈ ప్రభుత్వం నాలుగేళ్లుగా చేసిన ప్రతి పాపంలో మీకు బాధ్యత ఉందా? లేదా?

- మీ అన్న సీఎం కాలేదన్న కడుపు మంటే మీ పార్టీ సిద్ధాంతమా?

- ఓట్ల చీలిక కోసమే రంగంలోకి దిగారా?- ఏ విలువల్ని మీ నుంచి నేర్చుకోవాలి?

- తండ్రి చనిపోగానే జగన్ ముఖ్యమంత్రి కావాలనుకున్నారని మీకెవరు చెప్పారు? మీ అన్నను ఎవరన్నా ఫోన్ చేసి అడిగారా? నిన్ను అడిగారా?

- గత ఎన్నికల్లో మీ మద్దతు ఎవరు అడిగారు? మేం అడిగామా? మాకు కావాల్సింది ప్రజల మద్దతు. చంద్రబాబు నాయుడుకు కావాల్సింది మీ మద్దతు. అయితే, మీ మద్దతు, లేదంటే మీ ద్వారా ఓట్లు చీల్చేందుకు డ్రామా

- జగన్ గారి మీద దుర్మార్గపు నిందలా? ఆయన వ్యక్తిత్వం మీ జీవితంలో సాధ్యమేనా?

- మీరు రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడతారా?  అంటూ వాసిరెడ్డి పద్మ ప్రశ్నలు సంధించారు. 

  • Loading...

More Telugu News