నటి శ్రీదేవి: వీరాభిమానం.. శ్రీదేవి పేరిట యాక్టింగ్ ఇనిస్టిట్యూట్!
- 2018లో చెన్నై లో యాక్టింగ్ ఇనిస్టిట్యూట్
- ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, కోల్ కతాలో బ్రాంచ్ లు
- శ్రీదేవికి వీరాభిమాని అనీశ్ నాయర్ వెల్లడి
అందాల సీనియర్ నటి శ్రీదేవి తన నటనతో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పలు భాషా చిత్రాల్లో నటించిన శ్రీదేవికి అభిమానులకు కొదువ లేదు. అలాంటి వీరాభిమాని అయిన అనీశ్ నాయర్ ఆమె పేరిట ఓ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ ను ప్రారంభించాలని అనుకున్నారు. చెన్నైకి చెందిన అనీశ్ ఈ విషయాన్ని మీడియా ద్వారా వెల్లడించాడు.
2018లో చెన్నైలో ఈ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ ని ప్రారంభించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, కోల్ కతాతో పాటు పలు దేశాల్లోనూ ఈ ఇనిస్టిట్యూట్ కి సంబంధించిన బ్రాంచ్ లు ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. నటన పట్ల ఆసక్తి ఉన్న పేద పిల్లలకు తమ ఇనిస్టిట్యూట్ లో ఉచిత శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నట్టు చెప్పారు. కాగా, తన పేరిట యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయనున్న విషయం తెలుసుకున్న శ్రీదేవి సంతోషించడమే కాకుండా, అతనికి తన సహకారం ఉంటుందని చెప్పారట.