ఆర్బీఐ: కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ

  • ద్రవ్యోల్బణం పెరిగిన దృష్ట్యా కీలక వడ్డీ రేట్లలో మార్పులు లేదు
  • చివరి ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్ష 2018 ఫిబ్రవరి 6,7 తేదీల్లో
  • ఎంపీసీ సమావేశంలో నిర్ణయాలను ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్

ద్రవ్యోల్బణం పెరిగిన దృష్ట్యా కీలక వడ్డీ రేట్లలో మార్పులు చేయలేదని, వాటిని యథాతథంగానే ఉంచుతున్నామని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిమిత్తం పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిన్న, ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలో ఇటీవల చోటుచేసుకున్న సంస్కరణలతో వృద్ధిరేటు అంచనాను చేరుకుంటామని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2018 ఫిబ్రవరి 6,7 తేదీల్లో చివరి ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్ష జరగనున్నట్టు తెలిపారు.

ప్రస్తుతం ఆర్బీఐ వడ్డీ రేట్లు..

రెపో రేటు - 6 శాతం, రివర్స్ రెపో రేటు - 5.75 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు - 6.25 శాతం,బ్యాంకు రేటు - 6.25 శాతం

  • Loading...

More Telugu News