వైఎస్ జగన్: బజార్లో దొరికే బూట్లతోనే నడుస్తున్నా.. ఎటువంటి ప్రత్యేకతలు లేవు!: జగన్

  • ఆ బూట్లకు ఎటువంటి ప్రత్యేకతలు లేవు
  • కొంచెం క్వాలిటీగా ఉన్నాయి అంతే
  • జగన్  మేలు చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉందన్న వైసీపీ అధినేత

బజార్లో దొరికే బూట్లు ధరించే తాను నడుస్తున్నానని, వాటికి ఎటువంటి ప్రత్యేకతలు లేవని ఓ ప్రశ్నకు సమాధానంగా వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ‘సాక్షి’ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘అందరూ ధరించే బూట్లను నేను వాడుతున్నా. కాకపోతే, కొంచెం క్వాలిటీ ఉన్నాయి" అంటూ నవ్వేశారు జగన్.

"ప్రభుత్వం మోసం చేసిందనేది ప్రజల్లో విపరీతంగా నాటుకుపోయింది. ‘కచ్చితంగా జగన్ ఏదో చేస్తాడు, మాకు భరోసా ఇవ్వడానికి ఎండలో తిరుగుతున్నాడు, ఈరోజు కాకపోయినా జగన్ మంచి చేసే పరిస్థితి ఉంటుంది’ అనేది దేవుడి దయవల్ల ప్రజల్లో ఉంది. ‘ఏదో ఓ రోజున దేవుడు, మనం జగన్ ని ఆశీర్వదిస్తాం..కచ్చితంగా ఆ రోజున జగన్ మనకు మేలు చేస్తాడు’ అనే నమ్మకం ప్రతి వర్గంలో కనిపిస్తోంది. అదే నన్ను నడిపిస్తోంది..అదే నాకు కిక్ ఇస్తోంది.

 ప్రజల్లో ఉన్న ఆ నమ్మకం చూస్తుంటే, వారికేదైనా కచ్చితంగా చేయాలనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి అనేది కోట్ల మంది ప్రజల్లో ఒకరికే దేవుడు ఇస్తాడు. అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఉన్నప్పుడు ప్రజలకు ఎంత మంచి చేయాలంటే.. రేపు మనం ఉన్నా? లేకపోయినా? ప్రతి ఇంట్లో మన ఫొటో ఉండాలి.. ప్రతి గుండెలోను మనం బతికే ఉండాలి’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News