‘పద్మావతి’: ‘పద్మావతి’ వివాదంపై వాళ్లెందుకు స్పందించరు?: శత్రుఘ్నసిన్హా

  • ‘పద్మావతి’ వివాదంపై మోదీ, స్మృతి ఇరానీ ఎందుకు స్పందించరు?
  • అలానే అమితాబ్, ఆమిర్, షారూక్ స్పందించరే?
  • ప్రజలు ప్రశ్నిస్తున్నారంటూ శత్రుఘ్న సిన్హా ట్వీట్

‘పద్మావతి’ వివాదంపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఈ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బాలీవుడ్ సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, షారూక్ ఖాన్ ఎందుకు స్పందించటం లేదని ప్రజలు అడుగుతున్నారని ఆ ట్వీట్ లో ఆయన ప్రశ్నించారు.

కాగా, రాజ్ పుత్ కర్ణిసేన కార్యకర్తలు శత్రుఘ్నసిన్హాకు ఈరోజు సన్మానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన్ని సత్కరించి, మహారాణి పద్మిని చిత్ర పటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ‘పద్మావతి’ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి వ్యతిరేకంగా సిన్హా మాట్లాడటం గమనార్హం. ఈ చిత్రం సెన్సార్ పూర్తి కాకముందే మీడియా కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పద్మావతి’ సినిమాను కర్ణిసేన కార్యకర్తలకు చూపిస్తానని మాట ఇచ్చిన భన్సాలీ, ఆ మాట తప్పారని విమర్శించారు. రాజ్ పుత్ సంఘం కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News