: ఎంపీల సూచనను పాటించిన సోనియా


కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పోరాడిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాకండమ్మా.. అంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎంపీలు చేసిన వినతిని సోనియా మన్నించినట్టే అనుకోవాలి. ఈ రోజు పార్లమెంటులో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు సోనియాగాంధీ దూరంగా ఉన్నారు. ప్రధాని సహా పలువురు ప్రముఖులు హాజరైనా ఆమె మాత్రం అటువైపు చూడలేదు. ఎంపీలు కావూరి సాంబశివరావు, సాయి ప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు నిన్న అధినేత్రిని కలిసి విగ్రహావిష్కరణకు దూరంగా ఉండండంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరు కావాలని తొలుత అనుకున్న సోనియాగాంధీ ఎంపీల సూచనతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

  • Loading...

More Telugu News