రామ మందిరం: రామ మందిరం సమస్యతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు: అసదుద్దీన్ ఒవైసీ

  • బీజేపీ, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ పై ఆరోపణలు గుప్పించిన ఒవైసీ
  • 2019లో మోదీ ప్రభుత్వాన్ని రక్షించేందుకు యత్నిస్తున్న సంఘ్ పరివార్
  • మీడియాతో మాట్లాడిన ఎంఐఎం అధ్యక్షుడు

రామ మందిరం సమస్యను అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకోవాలని బీజేపీ, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ చూస్తున్నాయని ఎంఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని రక్షించాలనే లక్ష్యంతో రామ మందిరం సమస్యను అడ్డుపెట్టుకోవాలని సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోందని అన్నారు. సున్నీ వక్ఫ్ బోర్డు తరపున సుప్రీం కోర్టులో కపిల్ సిబాల్ వాదనను ఒవైసీ సమర్ధించారు.

 2018 అక్టోబర్లో రామ మందిరం నిర్మాణం పూర్తవుతుందంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఒవైసీ ప్రస్తావించారు. ఇటువంటి వ్యాఖ్యల ద్వారా ముస్లింలను రెచ్చగొట్టి, పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో పేదవాడు మరింతగా కుంగిపోయాడని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం, రైతు ఆత్మహత్యల అదుపు విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దేశంలో ఇన్ని సమస్యలు నెలకొన్న తరుణంలో ఎన్నికలు జరగాలి తప్పా, రామ మందిరం నిర్మాణం కాదని విమర్శించారు.

  • Loading...

More Telugu News