బీజేపీ: ఏపీలో బీజేపీకే భవిష్యత్: మురళీధర్ రావు
- ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండదు
- ‘పోలవరం’ కు బీజేపీ వ్యతిరేకం అనడం పొరబాటు
- ఆ ప్రాజెక్టు నిర్మాణానికి మా పార్టీ కట్టుబడి ఉంది: మురళీధర్ రావు
ఏపీలో బీజేపీకే భవిష్యత్ ఉంటుందని, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండదని భారతీయ జనతా పార్టీ నేత మురళీధర్ రావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ కు బీజేపీ వ్యతిరేకం అనడం పొరబాటని అన్నారు. తొందరపాటుగా మాట్లాడడానికి బీజేపీ 10 జిల్లాల్లో ఉన్న పార్టీ కాదని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు.