: శిశువుల మరణాల్లోనూ మనది టాప్ ప్లేసే


అభివృద్ధి వైపు అడుగులు. ఆకాశహార్మ్యాలు. అత్యాధునిక వైద్య సదుపాయాలు. టెక్నాలజీ సామర్థ్యం. నున్నటి రోడ్లు. ఇవన్నీ ఆధునిక భారత స్వరూపం. కానీ, ఏదీ ఏదేదీ... ముద్దులొలుకుతూ బోసినవ్వులు చిందించే ఆ పసివారు కళ్లు తెరచిన మొదటి రోజే శాశ్వతంగా కనుమూస్తుంటే, ఏమైందీ అభివృద్ధి భారతం.? ఎందుకు ఆపలేకుందీ..?

దేశంలో ఏటా పుట్టిన తొలిరోజే మరణిస్తున్న శిశువులు 3,09,300. ఈ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు మరణిస్తున్న చిన్నారుల్లో మూడింట ఒక వంతు(29శాతం). నెలలు నిండకముందే జన్మించడం, అపరిశుభ్రత, తల్లి ఆరోగ్యం సరిగా లేకుండడం మొదలైన కారణాలు తొలిరోజే శిశువుల మరణానికి దారితీస్తున్నాయి.

అమెరికాకు చెందిన 'సేవ్ ద చిల్డ్రన్' అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా 176 దేశాలలో శిశువుల మరణాలకు సంబంధించి నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు మరణిస్తున్న శిశువులలో అమెరికా వాటా కేవలం ఒక శాతంగా ఉంది. చైనాలో 5శాతం మంది కనుమూస్తున్నారు. అసలు ఇలా చనిపోతున్న చిన్నారుల్లో మూడింట రెండొంతులు భారత్, చైనా, ఇండోనేషియా, పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, ఆఫ్రికా, నైజీరియా, ఇథియోపియాలో వారే!

  • Loading...

More Telugu News