padmavathi: నా సోదరుడి మరణానికి, 'పద్మావతి' సినిమాకు ఏ సంబంధం లేదు: మృతుడి సోదరుడు
- జైపూర్ నహర్గర్ కోటలో ఉరివేసుకున్న చేతన్ కుమార్ సైనీ
- ఆత్మహత్య కాదు హత్య అంటున్న మృతుడి సోదరుడు రామ్ రతన్ సైనీ
- పశ్చాత్తాపం చెందిన కర్ని సేన సభ్యులు
జైపూర్లోని నహర్గర్ కోటగోడకు ఉరివేసుకుని చనిపోయిన చేతన్ కుమార్ సైనీ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించారని చేతన్ కుమార్ సోదరుడు రామ్ రతన్ సైనీ అన్నాడు. పద్మావతి చిత్రానికి తన సోదరుడు మరణానికి, ఎలాంటి సంబంధం లేదని రామ్ రతన్ స్పష్టం చేశాడు. తన సోదరుడి మరణం మీద ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని కోరాడు.
ఉరి వేసుకున్న ప్రదేశానికి సమీపంలో రాళ్ల మీద ఉన్న రాతలు పొంతన లేకుండా ఉన్నాయని రతన్ సైనీ అన్నాడు. 'మేం పటాలను మాత్రమే దగ్ధం చేయం' అనే రాతలతో పాటు 'పద్మావతి శత్రువు' అనే రాతప్రతి అక్కడ లభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ రాతలు వివాదాన్ని రెచ్చగొట్టేందుకే ఎవరో రాశారని కర్ని సేన అంటోంది. అలాగే ఈ ఘటన పట్ల వారు పశ్చాత్తాపం చెందుతున్నట్లుగా కర్ని సేన నాయకుడు లోకేంద్ర సింగ్ కల్వి అన్నారు.