: మన్యం వీరుడికి జోహార్లు


అతడి మాటవింటే తెల్లవారి గుండెల్లో బుల్లెట్లు దిగుతాయి. ఎప్పుడు ఏ రూపంలో దాడి చేస్తాడో తెలియని భయం. దేశం యావత్తూ తెల్లవారి బానిసత్వంలో, వారు పెట్టే చిత్ర హింసల భయంతో వణికిపోతుంటే ఒంటి చేత్తో తెల్లవారిని వణికించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. మొత్తానికి తమ ప్రాణాలకు ముప్పుగా భావించి అల్లూరిని కాల్చిచంపారు తెల్లదొరలు. నేడు ఆ వీరుడి 89వ వర్థంతి. ఈ సందర్భంగా విశాఖలో అల్లూరికి ఘనంగా నివాళి అర్పించారు. సీతమ్మధారలోని అల్లూరి విగ్రహానికి జివిఎంసి కమిషనర్ పూలమాలవేసి నివాళి అర్పించారు. పలు ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు కూడా నివాళి అర్పించి అల్లూరి సేవలను గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News