కట్నం తీసుకోనందుకు ఇంటికొచ్చి మరీ అభినందనలు చెప్పిన బిహార్ ముఖ్యమంత్రి!
- కట్నం తీసుకోకుండా యువకుడి ఆదర్శ వివాహం
- బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రోత్సాహం
- యువ దంపతులకు సర్ ప్రైజ్ ఇచ్చిన సీఎం
ఈ నేపథ్యంలో పాట్నాకు చెందిన సంజిత్ కుమార్, జూహి అనే యువతిని కట్నం లేకుండా ఈ నెల 19న మతాంతర వివాహం చేసుకున్నారని సీఎం దృష్టికి వచ్చింది. దీంతో నితీశ్ కుమార్ తీరిక చేసుకుని నేరుగా సంజిత్ కుమార్, జూహి ఇంటికి వెళ్లారు. పుష్పగుచ్చాలను అందించి వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. ఇతరులు కూడా వీరి బాటలో నడవాలని పిలుపునిచ్చారు.