: ఫేస్బుక్ తో మానసిక రోగాలు?
ఫేస్బుక్ ఇంకా అలాంటి అనేక సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లు కలిపి డిల్యూషన్లు తదితర మానసిక రోగాలు తలెత్తడానికి కారణం అవుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాలం అనేది ఇవాళ విపరీతంగా వాడుకలోకి వచ్చేస్తున్న నేపథ్యంలో దానివలన ఏర్పడగల విపరిణామాలు కూడా పెరుగుతున్నాయి. అంతర్జాలం అనే వ్యసనానికి లోబడి పోవడం అనేది.. సాంకేతికత భ్రమలకు కారణమవుతోందని, మానవ సంబంధాల మీద కూడా దుష్ప్రభావం చూపిస్తోందని అధ్యయనకర్తలు అంటున్నారు.
ఫేస్బుక్, చాట్ గ్రూపులే ఇందులో కీలకం అని టెల్ అవివ్ యూనివర్సిటీకి చెందిన షల్వాటా మానసిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్ యూరి నిట్జన్ అంటున్నారు. ఆయన చెబుతున్న వివరాల ప్రకారం.. అంతర్జాలానికి ఎక్కువగా వ్యసనపడిపోతున్నవారిలో రకరకాల ఆందోళనలు, గందరగోళం, భ్రమలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయిట. ఫేస్బుక్ వంటి ఇంటర్నెట్ వెబ్సైట్లు, సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తున్నాయని ఆయన అంటున్నారు.