: కాలుష్యంతో మేలు : చల్లబడుతున్న భూమి


బాధలో కూడా ఆనందం కూడా వెతుక్కోవడం అంటే ఇదే. ఒకవైపు కాలుష్యం పెరిగిపోతోందంటూ.. ప్రపంచం యావత్తూ ఆవేదన చెందుతున్న వేళ.. అదే కాలుష్యమేఘాల వల్ల భూమండలానికి అంతో ఇంతో మేలు జరుగుతుందని.. యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ కు చెందిన శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. మానవుల వలన వెలువడే కాలుష్య పదార్థాలు మేఘాలను దట్టంగా చేయడం వలన.. భూవాతావరణాన్ని చల్లబరిచేలా పనిచేస్తుంటాయని వారు చెబుతున్నారు.

మేఘాలు అనేవి గాలిలో ఉండే నీటిబిందువుల చేరికగానే ఉంటాయి. గాలిలో తగినంత తేమ ఉన్నప్పుడు.. ఈ నీటికణాలే మేఘాలుగా అవుతాయి. దశాబ్దాలుగా ఇది మనమెరిగిన సంగతే. ఈ నీటికణాల సంఖ్య ఎంత ఉన్నదనే విషయం మీదనే వాటి ఎగువనుంచి చూసినప్పుడు మేఘాలు ఎంత దట్టంగా ఉన్నాయనేది తేలుతుంది. దాన్ని బట్టే సూర్యరశ్మిని నియంత్రించడం వాటికి సాధ్యమవుతుంది. పరిశ్రమలు, వాహనాల నుంచి వచ్చే కాలుష్యం పొగమేఘాలు కూడా కొంత మేర ఈ మేఘాల్లో చేరి భూమి చల్లగా ఉండడానికి దారితీస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది.

  • Loading...

More Telugu News