‘పద్మావతి’: ‘పద్మావతి’ వివాదం దురదృష్టకరం : సీఎం మమతా బెనర్జీ
- భావ ప్రకటనా స్వేచ్ఛ నాశనానికి కంకణం కట్టుకున్న ఓ రాజకీయ పార్టీ
- ఇలాంటి హింసాత్మక శక్తులపై చిత్రపరిశ్రమ కలిసికట్టుగా పోరాడాలి
- ‘ట్విట్టర్’లో మమతా బెనర్జీ
‘పద్మావతి’ వివాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ సినిమాపై కొనసాగుతున్న వివాదం దురదృష్టకరమని, భావ ప్రకటనా స్వేచ్ఛను నాశనం చేసేందుకు ఓ రాజకీయ పార్టీ కంకణం కట్టుకోవడం దారుణమని మమత తన ట్విట్టర్ ఖాతాలో విమర్శించారు. ఇలాంటి హింసాత్మక శక్తులపై పోరాడేందుకు చిత్రపరిశ్రమ మొత్తం కలిసికట్టుగా నిలబడాలని ఆమె సూచించారు.