‘అన్న’ క్యాంటీన్లు: మంత్రి మారినా పథకం అమలు కావట్లేదు: ‘అన్న’ క్యాంటీన్లపై టీడీపీ నేత విమర్శలు
- ‘అన్న’ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్న టీడీపీ ఎమ్మెల్సీ మూర్తి
- వైద్య, ఆరోగ్యశాఖ తీరు బాగాలేదు
- డెంగ్యూ, మలేరియా బారిన పడకుండా ప్రజలను కాపాడాలి
ఏపీలో ‘అన్న’ క్యాంటీన్లు ఇంతవరకూ ఏర్పాటు చేయకపోవడంపై టీడీపీ ఎమ్మెల్సీ మూర్తి విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలలో ఆయన మాట్లాడుతూ, ‘అన్న’ క్యాంటీన్ల విషయమై ఆరు నెలల క్రితం పరిటాల సునీత ఏం సమాధానం చెప్పారో, అదే సమాధానాన్ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఇప్పుడు చెబుతున్నారని విమర్శించారు. ఆ శాఖకు మంత్రి మారినా, పథకం అమలు కావట్లేదని, ఆ క్యాంటీన్లను తక్షణం ఏర్పాటు చేయాలని కోరారు. వైద్య, ఆరోగ్య శాఖ తీరు కూడా బాగాలేదని, డెంగ్యూ, మలేరియా వ్యాధులు విజృంభిస్తున్నాయని, వాటి బారిన పడకుండా ప్రజలను కాపాడాలని ఆయన కోరారు.