: నేటి నుంచి భద్రాచలంలో వాగ్గేయకారోత్సవాలు
శ్రీరామచంద్రుడిని ఆరాధించి, ఆయన సేవలో తరించిన భక్తరామదాసు 380 వ జయంతిని పురస్కరించుకుని భద్రాచలంలో నేటి నుంచి వాగ్గేయకారోత్సవాలను నిర్వహిస్తున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ఈ సంగీత ఉత్సవాలు ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మల్లాది అరవిందశర్మ, నేదునూరి కృష్ణమూర్తి, మల్లాది సోదరులు వంటి ప్రముఖ సంగీత కళాకారులు ఈ వేడుకలో కచేరీలు చేస్తారు.