భద్రాచలం: భద్రాద్రి ఆలయంలో విరిగిపడిన విగ్రహం... భక్తురాలికి గాయాలు

  • రాజగోపురం పై నుంచి విరిగిపడ్డ సింహపు విగ్రహంలో కొంత భాగం
  • భక్తురాలి తలకు గాయాలు
  • ఆసుపత్రికి తరలింపు

భద్రాచలం ఆలయంలో కొన్ని రోజుల క్రితం చిన్నశిల విరిగిపడిన సంఘటన మరువకముందే మరో సంఘటన చోటుచేసుకుంది. రాజగోపురం పైనుంచి సింహపు విగ్రహంలో కొంత భాగం విరిగిపడింది. దీంతో, ఓ భక్తురాలి తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆలయ ప్రాంగణంలో ఇటీవల చిన్నశిల విరిగిపడిన ప్రాంతాన్ని పురావస్తు శాఖ అధికారులు సందర్శించి పలు సూచనలు చేశారు.

  • Loading...

More Telugu News