arachana: పెద్ద పెద్ద వాళ్లకే విమర్శలు తప్పలేదు .. నేనెంత?: సినీ నటి అర్చన

  • ఆ డైరెక్టర్ కి నేను నాజూకుగా కనిపించలేదేమో 
  • ఇక్కడ రకరకాల విమర్శలు ఎదురవుతూనే ఉంటాయి 
  • నాపై నాకు నమ్మకం వుంది 
  • లేదంటే ఇండస్ట్రీలో ఇంతకాలం ఉంటానా?

కథానాయికగా కొన్ని సినిమాలు చేసిన అర్చన, ఆ తరువాత ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆమె ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. "అర్చన అందంగానే ఉంటుంది గానీ ఆమెలో నాజూకుతనం లేదని ఓ తమిళ డైరెక్టర్ అన్నారు. ఆయన చేసిన ఆ కామెంట్ పట్ల మీరు ఎలా స్పందిస్తారు?" అనే ప్రశ్న అర్చనకి ఎదురైంది.

అందుకామె స్పందిస్తూ .. "ఈ విమర్శను నేను మొదటిసారిగా వింటున్నాను .. ఇంతవరకూ నాతో ఎవరూ అనలేదు. సక్సెస్ అనేది కనుక ఉంటే అన్నీ కొట్టుకుపోతాయి అనే విషయం మీకు తెలుసు కదా. ఆ డైరెక్టర్ కి నేను నాజూకుగా కనిపించలేదేమో. ఇక్కడ రకరకాలుగా చెప్పుకోవడం మామూలే. పెద్ద పెద్ద వాళ్లే ఇలాంటి విమర్శలను ఫేస్ చేయవలసి వచ్చింది .. నేనెంత?" అన్నారు. "ఎవరేమనుకున్నా నాపై నాకు నమ్మకం వుంది. అందువల్లనే ఇంతకాలంగా ఇండస్ట్రీలో వున్నాను .. లేదంటే ఏడుస్తూ ఇంట్లో కూర్చునేదాన్ని కదా" అంటూ చెప్పుకొచ్చారు.   

  • Loading...

More Telugu News