మా అమ్మ చాలా బాధ పడింది .. అందుకే పేకాట మానేశాను: శ్రీనివాస్ రెడ్డి
- పేకాట బాగా ఆడేవాడిని
- డబ్బులు కొంతవరకు పోయాయి
- అవకాశాల కోసం ప్రయత్నించలేదు
- సమయం వృథా అయింది
"ఎంతొచ్చింది .. ఎంతపోయింది అనేది ఎప్పుడూ నేను లెక్క వేయలేదు గానీ, చివరికి వచ్చేసరికి పేకాటలో మిగిలేది లాస్ అనే విషయాన్ని గ్రహించాను. ఎదుగుతున్న కొద్దీ ఈ వ్యసనం నుంచి బయటపడాలని భావించాను. అవకాశాల కోసం ప్రయత్నించకుండా సమయాన్ని వృథా చేస్తున్నాననే విషయం అర్థమైంది. ఇక నా సంగతి తెలిసి మా అమ్మ చాలా బాధపడింది. అంతే .. అప్పటి నుంచి పేకాట మానేశాను. పేకాట వైపు వెళ్లొద్దనేదే నేను అందరికీ చెప్పదలచుకున్న మాట" అని అన్నారు.