మాజీ డీజీపీ దినేష్ రెడ్డి: అండర్ గ్రౌండ్ కమ్యూనిస్టులకు మా ఇంట్లో ఆశ్రయం కల్పించిన రోజులున్నాయి: మాజీ డీజీపీ దినేష్ రెడ్డి

  • మాది భూస్వామ్య కుటుంబం
  • మా నాన్నకు బీదాబిక్కీ అంటే ప్రేమ
  • ‘ప్రో పూర్ కమ్యూనిస్టు జమిందార్’ అని మా నాన్నకు పేరు
  • ఓ ఇంటర్వ్యూలో దినేష్ రెడ్డి

అండర్ గ్రౌండ్ కమ్యూనిస్టులు తమ ఇంట్లో ఆశ్రయం పొందిన రోజులున్నాయని మాజీ డీజీపీ దినేష్ రెడ్డి తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకున్నారు. ‘ఐడ్రీమ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నెల్లూరు జిల్లాలోని కోస్టల్ విలేజ్ మాది. నాడు నెల్లూరు జిల్లాలో ఉన్న 13 మంది జమిందారుల్లో మా నాన్న కూడా ఒకరు. భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను. మాకు చాలా భూములు ఉండేవి. మా ఇంటా వంటా ప్రభుత్వ ఉద్యోగం చేయడమనేది లేదు.

అయితే, అప్పుడు, నేను ఆలోచించింది ఏంటంటే.. ఉన్నతమైన చదువులు చదువుకోవాలని, ఫ్యామిలీ వ్యవహారాలను, మాకున్న భూములను చూసుకోవడం చేయాలని అనుకున్నాను. అప్పట్లో రాజకీయాలు అనేవి నా ప్రధాన ధ్యేయంగా ఉండేవి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాను. కాలేజ్ విద్య మద్రాసు లోని క్రిస్టియన్ కాలేజీలో, ఢిల్లీలో పీజీ చేశాను. మా నాన్న పెద్ద భూస్వామి అయినా కూడా అండర్ గ్రౌండ్ కమ్యూనిస్టులకు మా ఇంట్లో నాడు షెల్టర్ ఇచ్చారు.

నేను పుట్టకముందు మా జిల్లాలో కమ్యూనిస్టు మూవ్ మెంట్ తీవ్రంగా ఉండేది. మా నాన్నకు బీదాబిక్కీ అంటే చాలా ప్రేమ. పాతరోజుల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉండేవి కావు. అందుకని, బల్క్ డ్రగ్స్ కొనుగోలు చేసి.. జబ్బులతో బాధపడేవారికి ఆయన ఇస్తుండేవారు. అండర్ గ్రౌండ్ కమ్యూనిస్టులు మా ఇంట్లో షెల్టర్ తీసుకున్న రోజులున్నాయి. 1960లలో నక్సల్స్ మూవ్ మెంట్ తీవ్రంగా ఉన్న రోజుల్లో భూ స్వాములందరూ గ్రామాలు వదిలి వెళ్లిపోతుండే వారు. మా నాన్న మాత్రం గ్రామం వదిలి పోలేదు. దీనిని బట్టి చూస్తే మా నాన్నకు ఎవరూ వ్యతిరేకం కారనే విషయం తెలుస్తుంది. ‘ప్రో పూర్ కమ్యూనిస్టు జమిందార్’ అని మా నాన్న గురించి అప్పట్లో పేపర్లో కూడా వచ్చింది.

  • Loading...

More Telugu News