గుణశేఖర్: చంద్రబాబు గారు నా మీద ఎందుకు కక్ష కడతారు?: దర్శకుడు గుణశేఖర్

  • సీఎం చంద్రబాబు మంచి రాజకీయవేత్త
  • నాపై కక్ష కట్టేంత తీరిక బాబుకు ఎక్క‌డ ఉంటుంది?
  • ఓ ఇంటర్వ్యూలో గుణశేఖర్

ఉత్తమ చిత్రం కేటగిరీలో ‘రుద్రమదేవి’కి నంది అవార్డు దక్కక పోవడంపై ఆ సినిమా దర్శకుడు గుణశేఖర్ ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తన సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఎందుకు ఇవ్వలేదనే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తూ ఓ ట్వీట్  చేశారు.

తాజాగా, ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘సీఎం చంద్రబాబు మంచి రాజకీయవేత్త. ఆయన ప్రజల మనిషి. ఏ ఒక్కరికో చెందిన వ్యక్తి కాదు. విజన్ ట్వంటీ 20, ఐటీ విజన్ తో ముందుకు సాగారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు గారిని అభిమానించే వాళ్లలో నేనూ ఒకడిని. నా మీద ఆయనెందుకు కక్ష కడతారు? అంత తీరిక ఆయ‌న‌కు ఎక్క‌డ ఉంటుంది?

నా సినిమాకు అవార్డు రాక‌పోవ‌డం అన్నది ఏదో స‌మాచార లోపం వల్ల జరిగి వుంటుంది. ఒక్కోసారి అది కూడా క‌రెక్టు కాద‌నిపిస్తోంది. మంత్రులు అయ్య‌న్న‌, గంటా శ్రీనివాస్ ద్వారా సీఎం దృష్టికి  తీసుకెళ్లాను. క‌చ్చితంగా నా మీద  కక్ష కట్టే మ‌నిషి ఆయ‌న కాదు. బాలకృష్ణకూ, నాకూ స‌న్నిహిత సంబంధాలు లేవు. అయినా ఆయ‌న్ని నేను ఎంత‌గానో అభిమానిస్తా’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News