ఇందిరమ్మ: ఈ నెల 18న మదనపల్లిలో ఇందిరమ్మ విగ్రహావిష్కరణ: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి

  • మాజీ ప్రధాని ఇందిర‌మ్మ ఆలోచ‌న‌లు నేటికీ మార్గదర్శకం 
  • ముఖ్యఅతిథిగా హాజరుకానున్న పుదుచ్చేరి ముఖ్యమంత్రి 
  • ఓ ప్రకటనలో ఏపీ పీసీసీ చీఫ్

దేశంలో నేడు ఎదురవుతున్న అనేక స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఇందిర‌మ్మ ఆలోచ‌న‌లు, ఆచ‌ర‌ణ నేటికీ మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తాయ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి పేర్కొన్నారు. మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ శ‌త జ‌యంత్యుత్సవాల ముగింపు బ‌హిరంగ స‌భ ఈ నెల 18న చిత్తూరు జిల్లా మ‌ద‌నప‌ల్లిలో నిర్వ‌హిస్తున్న‌ట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్యఅతిథిగా హాజరుఅవుతారని ఆయన పేర్కొన్నారు. ఏపీ కాంగ్రెస్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఇందిర‌మ్మ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను గ‌త ఏడాది న‌వంబ‌ర్ 19వ తేదీన క‌ర్నూల్ జిల్లా కోడుమూరులో రైతు మ‌హాస‌భ నిర్వహించి ప్రారంభించామని తెలిపారు. ఏడాది పాటు దేశ వ్యాప్తంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News