వైసీపీ: వైసీపీ జెండా ఎగరకపోవడంతో జగన్ అసహనం!
- కోటకందుకూరులో ఎగరని జెండా
- చివరకి, ఓ బాలుడిని జెండా స్తంభంపైకి ఎక్కించి ఆవిష్కరింప జేశారు
- ఆళ్లగడ్డకు చేరుకున్న జగన్
వైసీపీ జెండా ఎగరక పోవడంతో అధినేత జగన్ కొంత అసహనానికి గురైన సంఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరులో జరిగింది. జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కోటకందుకూరుకు ఈరోజు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ జెండాను ఎగురవేయాలనుకుంటే అది ఎంతగా ప్రయత్నించినా ఎగరలేదు.
దీంతో, అధినేత జగన్ కొంత అసహనానికి గురయ్యారు. ఓ బాలుడిని జెండా స్తంభంపైకి ఎక్కించి దానిని ఆవిష్కరించాల్సి వచ్చింది! కాగా, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆళ్లగడ్డ చేరుకున్నారు. అంతకుముందు పాలసాగరంలో వైఎస్ జగన్‌ను ఐకేపీ యానిమేటర్లు కలిశారు.