మాజీ ఎమ్మెల్యే: డీడీల ఫోర్జరీ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు

  • హైదరాబాద్ లోని హుస్సేనీ ఆలం ఎస్బీఐను మోసగించినట్టు ఆరోపణలు
  • కందికుంట సహా అసిస్టెంట్ మేనేజర్ కు ఐదేళ్ల జైలు
  • ఇన్ స్పెక్టర్ వెంకటమోహన్ కు మూడేళ్ల జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్టు

డీడీల ఫోర్జరీ కేసులో కదిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు నిచ్చింది. హైదరాబాద్ లోని హుస్సేనీ ఆలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు ఫోర్జరీ డీడీలు సమర్పించి రూ.6 కోట్ల వరకు వెంకటప్రసాద్ మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుపై సీబీఐ కోర్టు విచారణ జరిపింది.

వెంకటప్రసాద్ తో పాటు, అసిస్టెంట్ మేనేజర్ నర్శింగరావుకు ఐదేళ్ల జైలు శిక్ష, ఇన్ స్పెక్టర్ వెంకటమోహన్ కు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా, గత ఏడాదిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మోసం చేసిన కేసులో మాజీ మంత్రి షాకీర్ కు, వెంకట ప్రసాద్ కు సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించింది. ఆ కేసులో రూ.6 లక్షల జరిమానా కూడా ఆయనకు విధించింది. జైలు కెళ్లిన రెండు రోజుల్లోనే హైకోర్టులో బెయిల్ తీసుకుని వెంకట ప్రసాద్ బయటకొచ్చారు. తాజాగా, ఎస్బీఐను మోసం చేసిన కేసులోనూ ఆయనకు శిక్ష పడటం గమనార్హం.

  • Loading...

More Telugu News