హీరో సందీప్ కిషన్: సినీ రంగంలో మా మామ తర్వాత అంతటి అండ నిచ్చే వ్యక్తులు వాళ్లిద్దరూ!: హీరో సందీప్ కిషన్

  • జెమిని కిరణ్, అనిల్ సుంకర కోసం నేను ప్రాణమైనా ఇచ్చేస్తా
  • ఇండస్ట్రీలో నాకు తండ్రి లాంటి వ్యక్తి జెమిని కిరణ్ 
  • ‘రన్’ సినిమాకి అనిల్ చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు 

సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రొడ్యూసర్ జెమిని కిరణ్, నిర్మాత అనిల్ సుంకర కోసం అవసరమైతే ఏదైనా చేస్తానని చెప్పాడు యువ హీరో సందీప్ కిషన్. ‘ఐడ్రీమ్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘అవసరమైతే నేను ప్రాణం కూడా ఇచ్చేసే ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలంటే.. సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, మా మామ చోటా కె నాయుడు తర్వాత నాకు అంతటి అండ నిచ్చే వ్యక్తి ప్రొడ్యూసర్ జెమిని కిరణ్, నిర్మాత అనిల్ సుంకర. వాళ్ల కోసం నేను ఏదైనా చేస్తాను.

చోటా మామకు నేను మేనల్లుడిని కాబట్టి నాపై ప్రేమతో ఎంతో చేశారు. అదే, జెమిని కిరణ్ గారికి, నాకు ఎటువంటి రక్త సంబంధం లేదు. నేనంటే ఆయనకు ఇష్టం కాబట్టి ఈరోజు వరకు ఆయన నా వెన్నంటే ఉన్నారు. ఇండస్ట్రీలో నాకు తండ్రి లాంటి వ్యక్తి అంటే జెమిని కిరణ్ గారు. ‘రన్’ సినిమా అప్పుడు నాకు ముందుగా చెప్పిన డబ్బులు కంటే ఎక్కువ ఇచ్చిన వ్యక్తి అనిల్ సుంకర. అప్పుడు, ఆర్థికంగా నా పరిస్థితి అంతగా బాగుండలేదు. నేను అడగకుండానే ఆయన మా ఇంటికి డబ్బులు పంపారు. మన పరిస్థితి బాగుండనపుడు మన పక్కన కూర్చుని ఎవరైనా మాటలు చెబుతారు. కానీ, అనిల్ సుంకర అలా కాదు’ అని సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News