కమలహాసన్: ప్లీజ్.. కాజోల్ ని వదిలేయండి.. ఆటపట్టించకండి!: అభిమానులకు కమలహాసన్ సూచన
- కోల్ కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో అమితాబ్, కమల్ మధ్యలో నిలబడి కాజోల్ దిగిన ఫొటో
- ఆ ఫొటో క్యాప్షన్ పై ఆమె అభిమానుల విమర్శలపై కమల్ స్పందన
- ఆమెను ఆటపట్టించవద్దని సూచన
ఈ నెల 10న 'కోల్ కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవ' వేడుకలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్, ప్రముఖ నటుడు కమలహాసన్, నటి కాజోల్ తదితరులు పాల్గొన్నారు. అయితే, ఈ సందర్భంగా, అమితాబ్, కమల్ లకు మధ్యలో కాజోల్ నిలబడి ఓ ఫొటో దిగింది.
ఈ ఫొటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి ‘ఇద్దరు లెజెండ్స్ తో సెల్ఫీ.. ఆనందం పట్టలేకపోతున్నా’ అని కాజోల్ పేర్కొంది. అయితే, అది సెల్ఫీ కాకపోవడంతో అభిమానులు ఆమెను ఆటపట్టించడం మొదలెట్టారు. దీంతో ఆమెను ఆదుకోవడం కోసం కమల్ రంగంలోకి దిగాడు. కాజోల్ పై విమర్శలు గుప్పించడం ద్వారా ఆటపట్టించవద్దని కోరారు. ‘దయచేసి, కాజోల్ జీని వదిలేయండి! నాకు సెల్ఫీలంటే అభిమానం లేదు కానీ, వాళ్లిద్దరూ అంటే మాత్రం అభిమానం..’ అంటూ కమల్ ట్వీట్ చేశాడు.