రాశీఖన్నా: పాట పాడుతున్న అందాల నటి రాశీఖన్నా.. వీడియో ఇదిగో!
- ‘జవాన్’ సినిమాలో ఓ డ్యూయెట్ పాడిన రాశీ ఖన్నా
- రికార్డింగ్ థియేటర్ లో పాడుతున్న వీడియో వైరల్
- డిసెంబర్ 1న విడుదల కానున్న ‘జవాన్’
అందాల నటి రాశీఖన్నా మరోసారి సింగర్ అవతారమెత్తింది. సాయిధరమ్ తేజ్ సరసన జవాన్ చిత్రంలో నటిస్తున్న రాశీఖన్నా, ఆ చిత్రంలో ఓ డ్యూయెట్ సాంగ్ పాడింది. రికార్డింగ్ థియేటర్ లో రాశీఖన్నా ఈ పాట పాడుతుండగా తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది. కాగా, డిసెంబర్ 1న విడుదల కానున్న జవాన్ చిత్రానికి బీవీఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నారు.