బాబూమోహన్: నేను నాన్ లోకల్ అంటూ ప్రచారం చేయడం తగదు: ఎమ్మెల్యే బాబూమోహన్
- ఆందోల్ లో ఇరవై నాలుగేళ్లుగా నివసిస్తున్నా
- నేను నాన్ లోకల్ అంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు
- తెలంగాణ అసెంబ్లీ లాబీలో విలేకరులతో బాబూమోహన్
ఆందోల్ లో తాను ఇరవై నాలుగేళ్ళ నుంచి ఉంటున్నానని, అలాంటప్పుడు తాను నాన్ లోకల్ ఎలా అవుతానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాబూమోహన్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ లాబీలో విలేకరులతో ఈరోజు ఆయన మాట్లాడుతూ, తాను నాన్ లోకల్ అంటూ ఆందోల్ లో కొందరు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ప్రచారం చేయడం సబబు కాదని అన్నారు. తన నియోజకవర్గం అంతటా సింగూరు జలాలు అందిస్తున్నానని, ఈ జలాలతో 40 వేల ఎకరాలకు నీరు ఇస్తున్నామని, మరో ఎనిమిది మండలాల్లో పదివేల ఎకరాలకు నీరిచ్చే పనులు జరుగుతున్నాయని అన్నారు.