కృష్ణా నది: నేడు, రేపు కృష్ణా నదికి హారతి రద్దు!: దుర్గగుడి ఈవో
- ఫెర్రీ ఘాట్ వద్ద సోమ, మంగళ వారాల్లో హారతి రద్దు
- పడవ ప్రమాదానికి సంబంధించి గాలింపు చర్యలు పూర్తయిన తర్వాత ‘హారతి’ తిరిగి నిర్వహిస్తాం
- దుర్గగుడి ఈవో సూర్యకుమారి ప్రకటన
కృష్ణా నదిలో పడవ ప్రమాదం నేపథ్యంలో ఫెర్రీ ఘాట్ వద్ద సోమ, మంగళవారాల్లో నిర్వహించే హారతి కార్యక్రమం రద్దు అయింది. ఈ మేరకు విజయవాడ దుర్గగుడి ఈవో సూర్యకుమారి ఓ ప్రకటన చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన గాలింపు చర్యలు పూర్తయిన తర్వాత నదికి హారతి కార్యక్రమం తిరిగి నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా, ఫెర్రీ ఘాట్ వద్ద నిన్న జరిగిన పడవ ప్రమాదంలో కొందరు గల్లంతైన విషయం విదితమే.