మహిళా హోమ్ గార్డు: మహిళా హోమ్ గార్డుతో మసాజ్ చేయించుకున్న ఏఎస్ఐ.. వీడియో వైరల్!

  • జోగుళాంబ గద్వాలలో సంఘటన
  • మీడియాకు దొరికిపోయిన వైనం
  • విచారణకు జిల్లా ఎస్పీ ఆదేశాలు 

ఓ మహిళా హోంగార్డ్ తో ఏఎస్ఐ మసాజ్ చేయించుకుంటూ మీడియాకు దొరికిపోయిన సంఘటన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో జరిగింది. గద్వాలలోని సాయుధ రిజర్వ్ ఏఎస్ఐగా పని చేస్తున్న హసన్ మహిళా హోంగార్డ్ తో మసాజ్ చేయించుకుంటుండగా మీడియాకు దొరికిపోయాడు. మీడియా రావడాన్ని గమనించిన హసన్ వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ విచారణకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News