వైష్ణోదేవీ ఆలయం: ఇకపై వైష్ణోదేవీ ఆలయాన్ని రోజుకు యాభై వేల మంది మాత్రమే సందర్శించాలి: ఎన్జీటీ

  • పర్యావరణ కార్యకర్త  పిటిషన్ పై విచారణ.. మార్గదర్శకాలు జారీ
  • పాదచారుల కోసం నూతనంగా నిర్మించిన మార్గాన్ని ఈ నెల 24 నుంచి ప్రారంభించవచ్చు
  • ఈ కొత్త మార్గంలో బ్యాటరీ కార్లనే మాత్రమే అనుమతించాలి

ఇకపై జమ్మూకాశ్మీర్ లోని వైష్ణోదేవీ ఆలయాన్ని 50 వేల మంది భక్తులు మాత్రమే సందర్శించాలని పరిమితి విధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) మార్గదర్శకాలు జారీ చేసింది. జమ్మూకాశ్మీర్ లోని వైష్ణోదేవీ ఆలయ పరిసరాల్లో గుర్రాలను వినియోగించరాదంటూ, ఓ పర్యావరణ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ పై ఎన్జీటీ విచారణ చేపట్టింది. అంతకు మించి వచ్చే భక్తులను అర్ధక్వారీ లేదా కాత్రా వద్ద నిలిపివేయాలని, ఆలయానికి వెళ్లేందుకు పాదచారుల కోసం నూతనంగా నిర్మించిన మార్గాన్ని ఈ నెల 24 నుంచి ప్రారంభించవచ్చని, ఈ మార్గంలో బ్యాటరీ కారులు తప్పా, గుర్రాలు, గాడిదలకు అనుమతి ఇవ్వరాదని సూచించింది.

కాత్రా సమీపంలోని బస్టాప్ లోనూ, ఆలయానికి వెళ్లే దారుల్లోనూ చెత్త పడేసిన వారికి రెండు వేల రూపాయలు జరిమానా విధించాలని సూచించింది. పాత మార్గంలో కూడా క్రమంగా ఈ జంతువులను ఉపయోగించకుండా నిరోధించాలని ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది. పుణ్యక్షేత్రం లోపల చేపడుతున్న నూతన నిర్మాణాలను కూడా నిలిపివేయాలని జస్టిస్ స్వాతంతర్ కుమార్ ప్రత్యేక ధర్మాసనం ఆదేశించింది.  

  • Loading...

More Telugu News