సీఎం చంద్రబాబు: ‘విశాఖ’లో కన్వెన్షన్ సెంటర్ కు సముద్రతీరం అదనపు ఆకర్షణ: సీఎం చంద్రబాబు
- కొచ్చిలో పర్యటించిన చంద్రబాబు
- లులు గ్రూప్ కన్వెన్షన్ సెంటర్, మాల్ సందర్శన
- అంతకన్నా గొప్పగా ‘విశాఖ’లో నిర్మించాలని సూచించిన బాబు
‘విశాఖ’లో త్వరలో ఏర్పాటు చేయనున్న కన్వెన్షన్ సెంటర్ కు సముద్రతీరం అదనపు ఆకర్షణగా నిలుస్తుందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కొచ్చిలో ఈరోజు పర్యటించిన ఆయన, లులు గ్రూప్ కన్వెన్షన్ సెంటర్, మాల్ ను సందర్శించారు.
అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, కొచ్చిలో 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 250 గదులతో 10 వేల సీటింగ్ సామర్థ్యంతో వున్న కన్వెన్షన్ సెంటర్ ను సందర్శించానని చెప్పారు. విశాఖలో కన్వెన్షన్ సెంటర్, మాల్ నిర్మాణం త్వరగా చేపట్టాలని ఈ సందర్భంగా లులు గ్రూప్ ను ఆయన కోరారు. కొచ్చిలో కన్నా గొప్పగా విశాఖలో కన్వెన్షన్ సెంటర్, మాల్ ను నిర్మించాలని చంద్రబాబు సూచించారు.