కేసీఆర్ తీరు తెలంగాణ ప్రాంతం దేశంలో విలీనం కావడమే తప్పన్నట్టుంది!: కిషన్ రెడ్డి ధ్వజం
- వాస్తవాలు వక్రీకరించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారు
- నిజాం చరిత్రను తిరగరాయడం సరికాదు
- తెలంగాణా రాష్ట్రమా? లేక మజ్లిస్ తెలంగాణ రాష్ట్రమా? అన్న డౌట్ వస్తోంది
సీఎం మాటలు వింటుంటే ఇది తెలంగాణ రాష్ట్రమా? లేక మజ్లిస్ పార్టీ తెలంగాణ రాష్ట్రామా? అన్న అనుమానం తలెత్తుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీ ఏదైనా విషయం చెబితే ఆ వెంటనే దానిపై సచివాలయం నుంచి జీవో విడుదలవుతోందని ఆయన మండిపడ్డారు. అక్బరుద్దీన్, అసదుద్దీన్ లను పొగుడుతూ పాలన సాగిస్తున్నారని, ఇది రాష్ట్ర భవిష్యత్ కు మంచిది కాదని ఆయన హెచ్చరించారు.