నమిత: బాయ్ ఫ్రెండ్ ని వివాహమాడుతున్న ముద్దుగుమ్మ నమిత.. అధికారిక ప్రకటన!

  • బాయ్ ఫ్రెండ్ వీర్ తో కుదిరిన వివాహం
  • ఈ నెల 24న పెళ్లి ముహూర్తం
  • అభిమానుల ఆశీర్వాదాలు కావాలన్న నమిత

దక్షిణాది ముద్దుగుమ్మ నమిత ఎవరితోనో సహజీవనం చేస్తోందని, పెళ్లి చేసుకుందని ఇటీవలి కాలంలో వదంతులు వెలువడిన విషయం తెలిసిందే. ఈ వార్తలకు చెక్ పెడుతూ నమిత తన పెళ్లి గురించి తాజా ప్రకటన చేసింది. తన కుటుంబసభ్యులు, మిత్రుల సమక్షంలో నమిత తన బాయ్ ఫ్రెండ్ వీర్ (వీరేంద్ర చౌదరి)తో కలిసి తమ వివాహంపై మాట్లాడింది. ఈ నెల 24న తాము పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని వెల్లడించింది.

‘హాయ్ ఫ్రెండ్స్, మీకో శుభవార్త చెబుతున్నందుకు సంతోషంగా ఉంది. నవంబర్ 24, 2017 న మేము పెళ్లి చేసుకోబోతున్నాం. అభిమానుల ప్రేమ, మద్దతు, ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నాం’ అని యూట్యూట్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో పేర్కొంది. ఈ వీడియోలో నమిత, తనకు కాబోయే భర్త వీర్ తదితరులు ఉన్నారు.

 

  • Loading...

More Telugu News