కోమటిరెడ్డి వెంకటరెడ్డి: కేసీఆర్ పాలన చూస్తే రాజకీయాలపై వైరాగ్యం కలుగుతోంది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- ట్రస్ట్ పనులు చూసుకోవాలనిపిస్తోంది
- వ్యక్తిగత పాదయాత్రలకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతివ్వదు
- గుత్తా సుఖేందర్ పై విమర్శలు గుప్పించిన కోమటిరెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన చూస్తే రాజకీయాలపై వైరాగ్యం కలుగుతోందని, రాజకీయాలను వదిలేసి తన ట్రస్ట్ పనులను చూసుకోవాలనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. పిల్లికి బిచ్చం పెట్టని వ్యక్తి గుత్తా సుఖేందర్ రెడ్డి అని, భూపాల్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకుని గుత్తాకు కేసీఆర్ ఝలక్ ఇచ్చారని అన్నారు. టీఆర్ఎస్ లో గుత్తాది కక్కలేక మింగలేని పరిస్థితి అని విమర్శించారు. వ్యక్తిగత పాదయాత్రలకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతివ్వదనే విషయాన్ని ఈ సందర్భంగా కోమటిరెడ్డి ప్రస్తావించారు.