జైరా వాసిం: మనకు ఏది రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది!: ‘దంగల్’ నటి జైరా వాసిం
- తలరాతనే నమ్ముతా
- క్రికెట్ లో కోహ్లీ..బాక్సింగ్ లో మేరీ కోం అంటే ఇష్టం
- ‘మిడ్ నైట్ మారథాన్’కు ప్రచారకర్తగా ఎన్నికైన జైరా
మనం ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా, ఏది రాసిపెట్టి ఉందో అదే మనకు జరుగుతుందని గత మూడేళ్లలో తెలుసుకున్నానని ‘దంగల్’ నటి జైరా వాసిం అభిప్రాయపడింది. బెంగళూరులో వచ్చే నెలలో నిర్వహించనున్న ‘మిడ్ నైట్ మారథాన్’కు ప్రచారకర్తగా ఆమెను నియమించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, భవిష్యత్తు గురించి తాను ఎటువంటి ప్రణాళికలు వేసుకోనని, తన తలరాతనే నమ్ముతానని చెప్పింది.
ఈ సందర్భంగా క్రీడారంగంలో తనకు నచ్చిన ప్లేయర్స్ గురించి ప్రస్తావించింది. క్రికెట్ లో విరాట్ కోహ్లీ, బాక్సింగ్ లో అయితే మేరీ కోం ఇష్టమని జైరా వాసిం చెప్పింది. మేరీ కోం అంటే తనకు చాలా ఇష్టమని ఆమెపై మరో బయోపిక్ ఎవరైనా తీస్తే అందులో ఆమె పాత్రను తాను పోషించాలని ఉందనే ఆకాంక్షను బయటపెట్టింది.