బొక్కబోర్లాపడ్డ జపాన్ ప్రధాని.. పట్టించుకోకుండా ముందుకెళ్లిపోయిన ట్రంప్!
- జపాన్ ప్రధాని షింజో అబేతో గోల్ఫ్ ఆడిన అమెరికా అధ్యక్షుడు
- ట్రంప్ ను సాగనంపేందుకు వేగంగా కదిలి కిందపడిన షింజో
- జపాన్ సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఈ క్రమంలో ఆయన కాలు జారి పక్కనే వున్న గుంతలో పడిపోయారు. అబే పడిపోయిన విషయాన్ని ఏమాత్రం గమనించని ట్రంప్ తన దారిన తాను కారెక్కి వెళ్లిపోయారు. ఈ వీడియో జపాన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రధాని పడిపోయినా పట్టించుకోలేదంటూ ట్రంప్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. గుంతలో ఇసుక ఎక్కువగా ఉండడం వల్ల అందులో కాలుదూరి తడబడి ప్రధాని కిందపడిపోయారని భద్రతాధికారులు తెలిపారు.