శాంతి స్వరూప్: లేడీ గెటప్ లు వేసినంత మాత్రాన అసభ్య కామెంట్లు చేస్తారా?: ‘జబర్దస్త్’ నటుడు శాంతి స్వరూప్

  • లేడీ గెటప్ లతో లాభనష్టాలు రెండూ ఉన్నాయి
  • ‘లేడీగా మారిపోయారా?’, ‘ఆపరేషన్ చేయించుకున్నారా?’ అని మెస్సేజ్ లు 
  • ఓ ఇంటర్వ్యూలో నటుడు శాంతి స్వరూప్

లేడీ గెటప్ లు వేసినంత మాత్రాన విమర్శలు చేయడం తగదని, ఇటీవల తనపై కొంతమంది అసభ్య వ్యాఖ్యలు చేశారని ‘జబర్దస్త్’లో స్త్రీ పాత్రలు పోషించే నటుడు శాంతి స్వరూప్ అన్నాడు. ‘ఐడ్రీమ్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "లేడీ గెటప్ లు ధరించడం వల్ల మాకు లాభనష్టాలు రెండూ ఉన్నాయి. బయటకు వెళ్లినప్పుడు నా పాత్ర బాగుంటుందని, ‘జబర్దస్త్’లో ఎంట్రీ సాంగ్ తో నా ప్రవేశం బాగుందని చాలా మంది చెబుతారు.

ఇక, కాలేజీ విద్యార్థులు అయితే, కొంచెం అసభ్య కామెంట్స్ చేస్తుంటారు. ‘లేడీగా మారిపోయారా?’ ‘ఆపరేషన్ చేయించుకున్నారా?’ వంటి  ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ చాలా మంది సామాజిక మాధ్యమాల ద్వారా మెస్సేజ్ లు పెడుతుంటారు. సరైన ప్రశ్నలకు నేను తిరిగి సమాధానమిస్తా. నా పేరు మీద నాలుగైదు ఫేక్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. అవి చూసి మోసపోవద్దని చాలాసార్లు నేను చెప్పాను. ఎవరు ఏ కామెంట్ చేసినా పట్టించుకోను. పైగా, ఏ విషయమైనా నేను మొహం మీద చెప్పేస్తాను. లోపల ఏదీ దాచుకోను" అని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News