వైసీపీ నేత బొత్స: 2019లో అధికారంలోకి రావడమే మా లక్ష్యం: వైసీపీ నేత బొత్స
- టీడీపీని భూస్థాపితం చేయాల్సిన సమయం వచ్చింది
- 11 నుంచి రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు : బొత్స
- దేశ చరిత్రలో జగన్ ఒక సంచలన నేత
- జగన్ పైకి సీబీఐని ఉసిగొల్పుతున్నారు: వైసీపీ నేత భూమన
2019లో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీని భూస్థాపితం చేయాల్సిన సమయం వచ్చిందని విమర్శించారు. ఏపీని అనారోగ్యప్రదేశ్ గా మార్చారని, ఈ నెల 11 నుంచి రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు ప్రారంభించనున్నట్టు చెప్పారు.
వైసీపీకి చెందిన మరో నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, దేశ చరిత్రలో జగన్ ఒక సంచలన నేతగా పేరు గడించారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. జగన్ పైకి సీబీఐని ఉసిగొల్పి ఇబ్బందులు కల్పిస్తున్నారని, నాడు పొత్తులు లేకుండా 67 మంది ఎమ్మెల్యేలను వైసీపీ గెలుచుకోవడం గర్వకారణమని అన్నారు.