కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి: ఐదొందల కోట్లు ఖర్చు పెట్టినా కేసీఆర్ నాపై గెలవలేరు : కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి

  • నల్గొండ నుంచి కేసీఆర్ పోటీ చేయాలి
  • లేదా గజ్వేల్ లో నేను పోటీ చేస్తా
  • 50 వేల మెజార్టీతో కనుక నేను గెలవకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా
  • తెలంగాణ అసెంబ్లీ లాబీలో కోమటిరెడ్డి

నల్గొండ నుంచి కేసీఆర్ ను పోటీ చేయమని కోరుతున్నానని, రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆయన గెలవలేరని, అక్కడ తానే గెలుస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ నల్గొండ నుంచి పోటీ చేయాలి లేదా తానే గజ్వేల్ లో పోటీ చేస్తానని అన్నారు.

50 వేల మెజార్టీతో కనుక తాను గెలవకుంటే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాన్ని అక్బరుద్దీన్ పొగిడిన విషయం తమకు అవసరం లేదని, నరం లేని నాలుక అక్బరుద్దీన్ దని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మమ్మల్నీ ఆయన పొగుడుతారని విమర్శించారు.  

  • Loading...

More Telugu News