జైపాల్ రెడ్డి: ‘బంగారు దేశం’, ‘బంగారు తెలంగాణ’.. ఆ రెండూ ఇత్తడయ్యాయి!: మోదీ, కేసీఆర్ లపై జైపాల్ రెడ్డి విసుర్లు

  • మోదీలో అజ్ఞానం..అహంకారం రెండూ సమపాళ్లలో ఉన్నాయి
  • నోట్ల రద్దును ప్రపంచంలో ఏ ఆర్థికవేత్త సమర్థించలేదు
  • నోట్ల రద్దును సమర్థించిన కేసీఆర్ సంజాయిషీ ఇవ్వాలి
  • పాత్రికేయులతో ‘కాంగ్రెస్’ సీనియర్ నేత జైపాల్ రెడ్డి

పెద్ద నోట్ల రద్దు చేసి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడారు. ‘‘బంగారు దేశం’ అని మోదీ.. ‘బంగారు తెలంగాణ’ అని కేసీఆర్’ అన్నారు. ఇప్పుడు ఆ రెండూ ఇత్తడి అయ్యాయి’ అని విమర్శించారు. మోదీ నిర్ణయం, చీకటి నిర్ణయమని, నోట్ల రద్దును ప్రపంచంలో ఏ ఆర్థికవేత్త సమర్థించలేదని అన్నారు. మోదీలో అజ్ఞానం..అహంకారం రెండూ సమపాళ్లలో ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాడు నోట్ల రద్దును సమర్థించిన కేసీఆర్, ఇప్పుడు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాది నుంచి దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉందని, నోట్ల రద్దుతో జీడీపీ 2 శాతం తగ్గిందని, 45 లక్షల మంది ఉద్యోగాలు పోయాయని విమర్శించారు. 

  • Loading...

More Telugu News