జగన్: జగన్ అవినీతి చరిత్ర అంతర్జాతీయ స్థాయికెక్కింది: సోమిరెడ్డి
- అవినీతి గురించి జగన్ మాట్లాడుతుంటే నవ్వుతున్న ప్రజలు
- అబద్ధాలు చెప్పేందుకే పాదయాత్ర
- సహేతుక విమర్శలు చేయాలే తప్పా ప్రేలాపనలు కాదు
- ఒంగోలులో మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి
జగన్ అవినీతి చరిత్ర అంతర్జాతీయ స్థాయి కెక్కిందని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్యారడైజ్ పేపర్ల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆయన అవినీతి చరిత్రకెక్కిందని, అవినీతి గురించి జగన్ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని అన్నారు.
బెంగళూరులో అధునాతన భవంతిని నిర్మించుకున్న జగన్ కు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన జగన్, తన పాదయాత్రలో కూడా అదేరకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పేందుకే పాదయాత్ర చేస్తున్నాడని, సహేతుకమైన విమర్శలు చేయాలే తప్పా ప్రేలాపనలు పేలడం తగదని అన్నారు.