స్వాతి సోమనాథ్: నేను తమిళియన్ ని కాదు.. పదహారణాల ఆంధ్రా అమ్మాయిని!: ప్రఖ్యాత కళాకారిణి స్వాతిసోమనాథ్

  • చివరన నాన్న పేరు ఉండటంతో తమిళియన్ అనుకుంటారు
  • నేను శ్రీకాకుళం అమ్మాయిని
  • డ్యాన్స్ నేర్చుకోవడానికి స్ఫూర్తి మా నాన్నే
  • అందుకే, నా పేరులో ఆయన పేరు
  • ఓ ఇంటర్వ్యూలో కూచిపూడి కళాకారిణి స్వాతిసోమనాథ్

'నేను తమిళియన్ ని కాదు, పదహారణాల ఆంధ్రా అమ్మాయిని' అని ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి స్వాతిసోమనాథ్ అన్నారు. యూట్యూబ్ ఛానెల్ ‘తెలుగు పాప్యులర్ డాట్ కామ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నేను డ్యాన్స్ నేర్చుకోవడం సుమారు పదకొండు సంవత్సరాల వయసులో ప్రారంభించాను. మా నాన్నగారి పేరు దూసి సోమనాథరావు. శ్రీకాకుళం టౌన్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే మా గ్రామం పేరు దూసి. అది నా సొంతూరు. ఆ ఊరి పేరు మా ఇంటి పేరు కూడా అయింది.

ఇక నా పేరు పక్కన మా నాన్నగారి పేరును ఎందుకు చేర్చుకున్నానంటే.. నేను డ్యాన్స్ నేర్చుకున్న నాలుగేళ్ల తర్వాత 21 ఆగస్టు 1980న హైదరాబాద్ రవీంద్రభారతిలో అరంగేట్రం చేశాను. సుమతీ కౌశల్ గారు నా గురువుగా ఉన్నప్పుడు ఈ అరంగేట్రం చేశాను. నా ప్రదర్శనలలో మా నాన్నగారు చూసిన మొట్టమొదటిది, చివరిది ఇదే! 19 మే1981న మా నాన్న చనిపోయారు. ముప్పైఏడు లేదా ముప్పై ఎనిమిది సంవత్సరాలకే ఆయన చనిపోయారు.

ఆయన మంచి సాహితీవేత్త, మ్యూజీషియన్ కూడా. నేను డ్యాన్స్ నేర్చుకోవడానికి స్ఫూర్తి మా నాన్న కాబట్టి.. నాకు పేరొస్తే, మా నాన్నకు వచ్చినట్టే లెక్క. అందుకని, నా పేరులో మా నాన్న పేరుని చేర్చుకున్నా. అప్పటి నుంచి దూసి స్వాతిగా కాకుండా స్వాతి సోమనాథ్ గా ఉన్నా. నా పేరు చివరన మా నాన్న పేరు ఉంది కాబట్టి, నన్ను చాలా మంది తమిళియన్ అనుకుంటారు కానీ, అచ్చమైన, పదహారణాల ఆంధ్రా అమ్మాయిని నేను’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News