నాగం: ‘కాంగ్రెస్’ లోకి వెళ్తున్నట్టు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు: నాగం జనార్దన్ రెడ్డి
- పార్టీ మారాలనుకుంటే నన్నెవరు ఆపుతారు!
- నేను నిబద్ధత కలిగిన వ్యక్తిని
- వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచే పోటీ చేస్తా
- మీడియాతో నాగం
బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి పార్టీ మారనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీలోకి తాను వెళుతున్నట్టు దుష్ప్రచారం జరుగుతోందని, ఒకవేళ తాను పార్టీ మారాలనుకుంటే తనను ఆపే వారే లేరని అన్నారు. తాను నిబద్ధత కలిగిన వ్యక్తినని పేర్కొన్న నాగం, వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. విపక్షాల్లో సరైన నాయకుడు కనుక ఉంటే టీఆర్ఎస్ అడ్రసు గల్లంతవడం ఖాయమని, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ పుంజుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.