ఇవాంకా: హైదరాబాద్ రానున్న ట్రంప్ కూతురు ఇవాంకా..భారీ భద్రతా ఏర్పాట్లు!

  • ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్ లో పర్యటన
  • జీఈ సమిట్ లో పాల్గొననున్నఇవాంకా
  • రహేజా మైండ్ స్పేస్ లో బస
  • తాజ్ ఫలక్ నుమాలో డిన్నర్

హైదరాబాద్ లో ఈ నెలలో జరగనున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సమిట్ (జీఈఎస్)లో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా పాల్గొననున్నారు. ఈ నెల 28,29 తేదీల్లో ఆమె ఇక్కడ పర్యటించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. తన పర్యటన ముగిసే వరకు మాదాపూర్ లోని రహేజా మైండ్ స్పేస్ లో ఆమె బస చేస్తారు.

ఇక ఇవాంకా రాక సందర్భంగా ఆమె కోసం తాజ్ ఫలక్ నుమాలో డిన్నర్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన సీక్రెట్ సర్వీస్ బృందంతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు ‘తాజ్ ఫలక్ నుమా’ను సందర్శించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫలక్ నుమా ప్యాలెస్ కు అనుసంధానంగా ఉన్న మార్గాల్లో హై అలర్ట్ ప్రకటించారు. 500 మంది పోలీసులతో బందోబస్తుతో పాటు ‘ఆక్టోపస్’ని కూడా రంగంలోకి దింపనున్నట్టు సమాచారం.

కాగా, ఈ స‌మ్మిట్‌కు నాయ‌క‌త్వం వ‌హించాల్సిందిగా ప్ర‌ధాని మోదీ గ‌తంలో ఆమెను కోరారు. త‌న‌కు ఈ అవ‌కాశం క‌ల్పించినందుకు ఇవాంకా, మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేయడం విదితమే. బిజినెస్ విమెన్‌గా, ఫ్యాష‌న్ మోడ‌ల్‌గా అమెరికాలో పేరు ప్ర‌ఖ్యాతులు పొందిన ఇవాంకా ప్ర‌స్తుతం త‌న తండ్రి ట్రంప్ కి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

  • Loading...

More Telugu News