కేసీఆర్: రేపటి నుంచి తెలంగాణ రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా !
- ప్రయోగాత్మకంగా 3 జిల్లాల్లో రేపటి నుంచి అమలు
- ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీలతో సమావేశమైన కేసీఆర్
- విద్యుత్ సరఫరాలో లోటుపాట్లను అంచనా వేయనున్న అధికారులు
తెలంగాణలో 2018 ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రేపు రాత్రి నుంచి ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారంలో ఆరురోజుల పాటు ప్రయోగాత్మకంగా వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయనున్నారు. విద్యుత్ సరఫరాలో లోటుపాట్లను అధికారులు అంచనా వేస్తారు.