సిద్ధరామయ్య: కర్ణాటక సీఎం, మంగళూరు మేయర్ సరదా హ్యాండ్ పంచ్ లు!

  • మంగళూరులో జాతీయ కరాటే పోటీలు ప్రారంభం
  • సరదాగా కరాటే పంచ్ లిచ్చుకున్న సిద్ధరామయ్య, కవిత
  • ‘ఎంటర్ ది డ్రాగన్’ చూసి కరాటే గురించి కొద్దిగా తెలుసుకున్నా: సిద్ధరామయ్య

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మంగళూరు మేయర్ కవిత సనిల్ సరదాగా హ్యాండ్ పంచ్ లు ఇచ్చుకున్నారు. మంగళూరులోని నెహ్రూ మైదానంలో ఇండియన్ కరాటే చాంపియన్ షిప్ - 2017 పోటీల ప్రారంభోత్సవ సందర్భంలో ఈ సరదా సంఘటన చోటుచేసుకుంది.

ఈ పోటీలను ప్రారంభిస్తూ సిద్ధరామయ్య, కవిత సరదాగా పరస్పరం పంచ్ లు కురిపించుకున్నారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు ఆసక్తిగా తిలకించారు. కరాటే వీరుడు బ్రూస్ లీ ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమా చూసి కరాటే గురించి కొద్దిగా తెలుసుకున్నానని, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా మహిళలకు ఆత్మస్థైర్యం
పెరుగుతుందని సిద్ధరామయ్య అన్నారు. కాగా, ఇండియన్ కరాటే చాంపియన్ షిప్ - 2017 పోటీలు మంగళూరులో నిన్న ప్రారంభమయ్యాయి.

  • Loading...

More Telugu News