గౌతమీ: అవకాశాలు వచ్చినా, చిరంజీవితో నటించలేకపోయా!: సినీ నటి గౌతమి

  • సినీ రంగంలోకి పదహారేళ్ల వయసులో అడుగుపెట్టా
  • ఇండస్ట్రీని క్రమంగా అర్థం చేసుకున్నా
  • చిరంజీవితో నటించే అవకాశాలు వచ్చినా కుదర్లేదు
  • ఓ ఇంటర్వ్యూలో గౌతమి

తాను సినీ రంగంలో అడుగుపెట్టినప్పుడు ఆ రంగం గురించి తనకేమీ తెలియదని, జీవితంలో ప్రతిదీ పోరాడి సాధించానని ప్రముఖ సినీ నటి గౌతమి అన్నారు. ‘ఐ డ్రీమ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ఆర్టిస్ట్ ల జీవితాలు, సినిమా నిర్మాణం మొదలైన విషయాలన్నీ తెలుస్తున్నాయి. తన కెరీర్ ప్రారంభించినప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంటుందనే విషయమే తనకు తెలియదని, తమ కుటుంబానికి సినీ రంగంతో అసలు పరిచయమే లేదని చెప్పింది.

ఆర్టిస్ట్ ని కావాలనే తన తపన, తన తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే తాను ఈ రంగంలోకి ప్రవేశించానని పేర్కొంది. పదహారేళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చిన తాను, ఈ ఇండస్ట్రీని క్రమక్రమంగా అర్థం చేసుకున్నానని తెలిపింది. తెలుగు ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోలతోనూ తాను నటించానని, చిరంజీవితో నటించే అవకాశాలు వచ్చినా నటించలేకపోయానని గౌతమి పేర్కొంది. ఆ అవకాశాలు వచ్చిన ప్రతిసారి రజనీకాంత్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండేదానినని గుర్తుచేసుకుంది.

ఫలానా డైరెక్టర్ తో, ఫలానా హీరోతో చేయలేకపోయాననే బాధ తనకు ఉందని, ఈ ఆలోచన వచ్చినప్పుడు తనది చిన్నపిల్ల మనస్తత్వం అనిపిస్తుందని తెలిపింది. తాను టీవీ ఎక్కువ చూడనని, ఆ అలవాటు చాలా తక్కువ అని, తనకు ఉన్న పనుల కారణంగా ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లేదనే భావన కలుగుతోందని గౌతమి పేర్కొంది.

  • Loading...

More Telugu News